Breaking News ప్రాంతీయం

బెజగామలో గ్రామంలో హరిహర లిఖిత మహాయజ్ఞం

79 Views

– చేసుకున్న సేవే శాశ్వతం: భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

– లోక కళ్యాణర్థం భారతదేశం అంతా జరుగుతున్న ఈ లిఖిత యజ్ఞం

గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ కొట్లాది హరిహర లిఖిత సంఖ్యకు శ్రీకారం చుట్టి గ్రామ, గ్రామాన తిరిగి వందలాది భక్తులచే రామ, శివ నామాలను లిఖింపజేపిస్తున్నారు. ఈ తరుణంలో మంగళవారం నాడు గజ్వేల్ మండలం బెజగామ గ్రామంలోని హనుమాన్ మందిరంలో హరిహర లిఖిత మహాయజ్ఞం నిర్వహించిన సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. దేవాలయంలో భక్తులచే 2గంటల పాటు రామనామ స్మరణ చేయించి రామ, శివ నామాలను లిఖింపజెయించారు. అక్కడే లిఖించి రామకోటి రామరాజు కి అందజేశారు.

అనంతరం రామకోటి రామరాజు మాట్లాడుతూ ప్రతిరోజు భగవన్నామ స్మరణ చేయాలన్నారు. చివరికి తోడుండేది మనం చేసుకున్న పుణ్యమే అన్నారు. ఈ నామాలను త్వరలో శృంగేరి పీఠంకు అందజేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో చిలుముల సీతారాములు, శ్రీను, కొమురయ్య, శ్యామ్, స్వామి, ఆంజనేయులు, సురేందర్, నర్సింలు, నాచగిరి, ముత్యం పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్