రాయపోల్ మండలం పరిధిలోని ఎల్కల్ గ్రామానికి చెందిన కనకయ్య 57 వేల రూపాయలు, నర్సింలు 28 వేల రూపాయలు, సత్తయ్య 27 వేల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బిజెపి మండల అధ్యక్షుడు మాదాస్ వెంకట్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మంకీడు స్వామి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు అందజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్, కృష్ణ ,బర్కత్ శీను, బాలమల్లు, వెంకట్ గౌడ్ ,రాజు ,కుమార్, స్వామి, మల్లేశం ,రాజు, గారు రాములు, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
