మంచిర్యాల జిల్లా
ప్రతి బూత్ లో రాజ్యంగా గౌరవం దినోత్సవం ఘనంగా నిర్వహించాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి .
భారత దేశం 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి బూత్ స్థాయిలో “రాజ్యాంగ గౌరవ దినోత్సవం” కార్యక్రమం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జనవరి 22,23 తేదీల్లో ఎస్సీ మరియు ఎస్టీ ప్రజలతో సమావేశం నిర్వహించాలి, 24,25 తేదీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో రాజ్యంగం పట్ల బీజేపీ నిబద్దతను యువతలో ప్రచారం, 26 వ తేదీన గణతంత్ర దినోత్సవం ప్రతి బూత్ లో ఘనంగా నిర్వహించాలి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రజనీష్ జైన్, పట్టి వెంకట కృష్ణ, దుర్గం అశోక్, ఆరుముళ్ల పోషం, నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, తుల ఆంజనేయులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.
