రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణలో అభివృద్ధి, కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రజల సంక్షేమం సాధ్యం అవుతుందని, రానున్న ఎన్నికల్లో కెసిఆర్ ను మూడోసారి సీఎంగా గెలిపించుకొని రాష్ట్రంలో మరింత అభివృద్ధిని సాధించుకోవచ్చని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు చిందం రాజ్ కుమార్ అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని చిందం రాజ్ కుమార్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన నుండి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఉద్యమం స్థాపించనుండి ఆయనతో పాటు ఉండి ఉద్యమంలో పాల్గొని ఉన్న నాయకునిగా సింగం రాజ్ కుమార్ కు గుర్తింపు ఉంది ఆయన దుబ్బాక బీసీ వర్గానికి చెందిన నాయకునిగా గుర్తింపు ఎంతో ఉంది తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారి దౌల్తాబాద్ మండలానికి వచ్చిన కెసిఆర్ దొమ్మాటలో మొట్టమొదటి మహాసభను నిర్వహించారు. అప్పుడు నిర్మించిన మహాసభకు ఉమ్మడి జిల్లాలే కాకుండా వివిధ జిల్లాల నుండి కూడా దొమ్మట మహాసభకు ముందు నుండి నడిపించిన చిందం రాజ్ కుమార్ దుబ్బాక నియోజకవర్గంలోని వివిధ కార్యక్రమాలతో పాటు ఆర్థిక సహాయం కార్యక్రమాలను చేపడుతున్నారు. ముఖ్యంగా రైతుల కోసం వ్యవసాయానికి సాగునీరు అందించడానికి కాలేశ్వరం, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులను నిర్మించి రైతులకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టులను నిర్మించారని ఆయన అన్నారు. అలాగే రైతులకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశపెట్టి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఆకుపచ్చ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుల లక్ష్యమని పేర్కొన్నారు. రాయపోల్, దౌల్తాబాద్ మండలాలలోని చెరువులు, కుంటలు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన పథకాలను చూసి దేశంలో వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్ ను అభినందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఆదర్శమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను దేశంలో అమలు చేయడమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించారని చిందం రాజకుమార్ అన్నారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
