Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

స్థానికంగా ఉంటూనే పదో వార్డును అభివృద్ధి పథంలో నిలుపుతాను

126 Views

ఒట్టేసి చెబుతున్నా స్థానికంగానే ఉంటా

చల్ల పద్మ-హరికృష్ణ

పదవ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెలుతా…

రాజన్న సిరిసిల్ల/ఫిబ్రవరి 8/ప్రజా దర్బార్ ప్రతినిధి :

ఎల్లారెడ్డిపేట

…ఆశీర్వదించి గెలిపించండి స్థానికంగా ఉండి మీకు సేవలందిస్తా అంటూ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో పదవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థినిగా చల్ల పద్మ – హరికృష్ణ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 10వ వార్డులో గల ముష్టిపల్లి, భూపతి నగర్,చిన్న బోనాలలో అభ్యర్థినిచల్ల పద్మ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ గతంలో చల్ల హరికృష్ణ తండ్రి అభ్యర్థిని మామయ్య కీర్తిశేషులు చల్ల బాలయ్య ఈ ప్రాంతానికి చేసిన సేవలు, కృషిని గుర్తు చేశారు. చిన్న బోనాలలో మంచినీటి ట్యాంకు నిర్మాణానికి, పాఠశాల నిర్మాణానికి,హనుమాన్ దేవాలయానికి, పెద్దమ్మ దేవాలయానికి, స్థలాలను విరాళంగా ఇచ్చామని ప్రజలు అది మర్చిపోలేదని అన్నారు. మహిళా సంఘ భవనంకు స్థలం సొంత డబ్బులతో కొనిచ్చి బిల్డింగ్ సాంక్షన్ చేపించామన్నారు. తన భర్త ఎంపీటీసీగా, వైస్ ఎంపీపీ గా పెద్ద బోనాల నుండి చిన్న బోనాల వరకు సిసి రోడ్డు నిర్మాణం చేపించారని, హనుమాన్ల గుడి నుండి తండా వరకు సిసి రోడ్డు నిర్మాణం, చల్ల బాలయ్య ఇంటి నుండి హనుమండ్ల గుడి వరకు సిసి రోడ్డు నిర్మాణం, సలేంద్రి శంకరయ్య ఇంటి వద్ద నుండి పడిగే శంకరయ్య ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం,గ్రామంలో మూడు చోట్ల హైమాస్ లైట్ లు ఏర్పాటు చేపిచ్చింది ప్రజలకు తెలుసని అన్నారు. మొన్నటికి మొన్న బైపాస్ రోడ్డులో వరి ధాన్యం ఆరబోసుకుంటే ప్రమాదాలు జరిగి వాహనదారులు ఇబ్బందులకు గురికావడం, ధాన్యం

చర్యలు ఆరబోసిన రైతుల పై చట్టపరమైన తీసుకుంటామని హెచ్చరికలు జారీ కావడంతో ఐకెపి సెంటర్ కు తమ కృషితో ఇప్పుడున్న ప్రభుత్వంతో 10 ఎకరాల స్థలాన్ని ఇప్పిచ్చిన విషయం రైతులు మర్చిపోలేదని అన్నారు. గతంలో చేసిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే రానున్న రోజుల్లో 9వ ప్యాకేజీలో వాటర్ కెనాల్ పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీటిని తీసుకువస్తామని, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పదవ వార్డు ప్రజలకు ఇల్లు ද්විධ వారికి ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ జ్యోతి పథకం, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలన్నింటినీ పదవ వార్డు ప్రజలకు ముందుగా అందేలా కృషి చేస్తానని, ఐకెపిలో వడ్లు ఆరబోసుకోవడానికి సిసి నిర్మిస్తామని, గోదాముల నిర్మాణం చేపడతామని, పదవ వార్డులో అవసరమున్న ప్రతిచోట స్మశాన వాటిక లను నిర్మిస్తామని హామీ ఇస్తూ చల్ల బాలయ్య కుటుంబ సభ్యులుగా మాజీ ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ చల్ల హరికృష్ణ భార్యగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పదవ వార్డు ప్రజల ముందుకు వస్తున్నానని చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రచారంలో చల్ల పద్మ హరికృష్ణ ప్రజలను కోరారు.

No Slide Found In Slider.

Poll not found
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *