చిన్న నాటి మిత్రుల కుటుంబాలకు మిత్ర బృందం ఆర్థిక సహాయం.
ఎల్లారెడ్డిపేట మండలంలోని బో ప్పా పూర్ గ్రామానికి చెందిన అతికం శ్రీనివాస్ గౌడ్ మెదడు సంభందిత వ్యాధితో మరణించడంతో ఆయన భార్య,కూతురు పెద్ద దిక్కును కోల్పోవడంతో చిన్ననాటి మిత్రులు 1996,97 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి స్నేహాన్ని చాటుకున్నారు.
భవిష్యత్తులో స్నేహితుడి కుటుంభం కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు . గంభీరావుపేట మండలం గోరంట్యాల గ్రామానికి చెందిన మూల అంజిరెడ్డి 2015లో గుండెపోటుతో మరణించగా వారి కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చి 15వేల రూపాయలు ఆర్థిక సాయం అందించి మున్ముందు ఇరువురి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో గడ్డం మధుసూ దన్ రెడ్డి,ముత్యాల సత్యనారాయణ రెడ్డీ, శ్రీరామోజు దేవరాజు,వంగ ల శ్రీదర్,చెవుల శ్రీనివాస్,నాయిని భాస్కర్ రెడ్డి, చర్ల పల్లి ఎల్లారెడ్డి,ఎం డి అశ్వక్ హుస్సేన్, బోల్గం ఎల్లా గౌడ్,రాగుల శ్రీనివాస్, కోమిరి శెట్టి శ్రీనివాస్, పాలోజి నారాయణ, బద్ది పడిగ రాజిరెడ్డి, సి హెచ్ బాల కిషన్, బి .సంపత్ కుమార్, నిరటి రాజు ల తో పాటు మరికొందరు మిత్రులు పాల్గొన్నారు.
