జగదేవపూర్ మండల కేంద్రం లోని కలెక్టర్ వెంకటనరసింహ రెడ్డి తల్లి ఇట్టిరెడ్డి జానభాయి ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు విషయం తెలుసుకున్న రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,గజ్వేల్ ఏసీపి రమేష్, ఎంపీపీ బాలేశంగౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డిలు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు వారి వెంట మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, శశిధర్ శర్మ, సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం తదితరులు ఉన్నారు.