విద్యార్థులు గణితంను కష్టంతో కాకుండా ఇష్టం పెంచుకొని సాధన చేస్తే సులభతరం అవుతుందని మండల విద్యాధికారి నరసవ్వ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి ఉన్నత పాఠశాల సందర్శించి మండల స్థాయి గణిత ప్రతిభ పరీక్షలలో విజయం సాధించి జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను గణిత ఉపాధ్యాయులు వెంకట్ నర్సింగరావును అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్ననాటి నుంచే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని కనుగుణంగా నడుచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మునయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రయ్య, సర్పంచ్ బచ్చు చంద్రశేఖర్, ఎంపీఓ లక్ష్మీనరసయ్యా, గణిత ఉపాధ్యాయులు వెంకట్, నర్సింగరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
