ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 20, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఊరూరా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఉత్సాహంగా తరలివస్తున్నారు. శిబిరంలో వైద్య సిబ్బంది నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలను అందజేస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్నీ ఇప్పటి వరకు ఎంత మందికి కంటి పరీక్షలు నిర్వహించారు, ఎన్ని కళ్లద్దాలు పంపిణీ చేశారు తదితర వివరాలను వైద్య సిబ్బంది డాక్టర్” శశిప్రభ, ఏఎన్ఎం మనెమ్మ వివరణ కోరగా కళ్ళఅద్దాలు ఇచ్చిన వారిసంఖ్య (643) ఆర్డర్ చేసిన(669) జనవరి 19 నుండి మొదలుకొని నేటి వరకు 22 రోజులు పాటు నిర్వహించగా(2824) ఇలామార్చి 6 వరకు సంఖ్య పెరుగనున్నదని తెలిపారు. గ్రామంలో విస్త్రృత ప్రచారం నిర్వహించి అర్హులైన వారికి 100 శాతం కంటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారని తెలిపారు.ఈకార్యక్రమంలో కోఆర్డినేటర్ ప్రసాద్, వైద్య సిబ్బందితోపాటు ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు నిర్మల, తదితరులు ఉన్నారు.
