ప్రాంతీయం

మాజీ నక్సలైట్ నుండి తపంచా రెండు బుల్లెట్లు స్వాధీనం

157 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో
తేది: 26.10.2022 రోజున సాయంత్రం అందాద 07-30 ప్రాంతంలో ఎస్సై కోనరావుపేట కు ఒక వ్యక్తి ఆయుదాన్ని కలిగి ఉన్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బంది తో యుక్తంగా బావుసాయిపేట గ్రామానికీ వెళ్ళి తనికి చేసే క్రమంలో ఆ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో పొలాల వద్ద నుండి రోడ్ వైపు నడుచుకుంటూ వస్తుండగా పోలీస్ వారిని చూసి అక్కడినుండి పారిపోయే క్రమంలో పోలీసు వారు అతనిని పట్టుకొని తనికి చేయగా అతని వద్ద ఒక నాటు తుపాకి(తపంచా) మరియు రెండు 8 ఎం ఎం తూటాలు లబించినాయి. అనంతరం అతని వద్ద అవి ఉండుటకు గల విషయమై ఇద్దరి పంచుల సమక్షంలో విచారించగా ఇతని పేరు నేవూరి హన్మయ్య, తండ్రి. మల్లయ్య, వయస్సు. 75-సం.లు, ముదిరాజ్ కులం., గ్రామం. బావుసాయిపేట అని తెలుపుచూ ఇతను గతంలో జనశక్తి లో మిలిటెంట్ గా పనిచేసినాడని, ఆ సమయంలో అట్టి తపంచాను, బుల్లెట్లను పార్టీ వారు తనను తాను రక్షించు కొనుటకు పార్టీ కార్యకలాపాలు చూసే విషయంలో అట్టి ఆయుధాన్ని ఇచ్చినారని అప్పటి నుండి అతను అట్టి ఆయుధాన్ని తన పొలం వద్ద బద్రపరిచినాడని, ఈ క్రమంలో వారం రోజుల క్రితం తన భార్య అనారోగ్య కారణాలతో చనిపోగా, దినవరం చేసే విషయంలో తన కొడుకు తో గొడవ జరగగా అదే విధంగా తన కొడుకు గతం నుండి కూడా తండ్రి మాట వినడం లేదని ఎలాగైనా తన కొడుకును తన మాట వినేవిధంగా బయంలో పెట్టాలనే ఉద్దేశం తో తన వద్ద ఉన్న తపంచా ను చూపెట్టి తన మాట వినకపోతే చంపుతానని బెదిరించేందుకు నిన్న రాత్రి సమయం లో తన పొలం వద్ద దాచిన తపంచాను తీసుకునే వచ్చే క్రమంలోఅతనిని పట్టుకుని ఆ తపంచా రెండు 8ఎం ఎం బుల్లెట్లను స్వదీనపరుచుకోని అతనిపైన కేసు నమోదు చేసి ఈ రోజు రిమాండ్ కి పంపనైనది.
అదే విదంగా గతం లో జనశక్తి మరియు ఇతర నిషేదిత పార్టీ లలో పని చేసినపుడు తమ దగ్గర దాచుకున్నటువంటి ఆయుధాలను కలిగి ఉన్నట్లయితే వెంటనే సంబందిత పోలీస్ స్టేషన్ లో అప్పగించగలరు, ఒక వేల పోలీసులకు దొరికితే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ అన్నారు.ఈ కేసులోని నిందితున్ని పట్టుకొని అతని దగ్గరి నుండి అయుదం బుల్లెట్లను స్వాదీనపరుచుకున్న ఎస్సైని సిబ్బందిని ఎస్పి ఆభినందించినారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7