ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం సందర్భంగా చిత్రించిన 18 అడుగుల భారీ కెసిఆర్ చిత్రాన్ని గజ్వేల్ పట్టణంలో రామకోటి కార్యాలయంలో సోమవారం నాడు సందర్శించి తిలకించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ 18 అడుగుల భారీ చిత్రం 25కిలోల అవాలతో చిత్రించిన చిత్రం చాలా అద్భుతంగా ఉందని. కొనియాడారు. 5వసారి కేసీఆర్ చిత్రాన్ని 5 రకాలుగా చిత్రించడం అతని కళకు, కృషి, పట్టుదలను అభినందించారు. అనంతరం రామకోటి రామరాజును శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రగతి విద్యాసంస్థల చైర్మన్ అంబాదాసు, ప్రిన్సిపాల్ రహమత్, సామాజిక కార్యకర్త సాదిక్ పాషా, ఏఎంసీ డైరెక్టర్ ప్రవీణ్, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.