సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు పెడితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం
పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత,
అక్టోబర్ 27
సిద్దిపేట్ జిల్లా సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు. అలా కాదని తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేయడం జరిగింది నిరంతరం నిఘా పెట్టడం జరుగుతుంది. అలా పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరియు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను, పోస్ట్ చేయవద్దని, వ్యక్తిగత దూషణకు దిగడం, వార్నింగ్ ఇవ్వడం, అంతర్గత వివరాలు గురించి అనవసర పోస్టులు, కామెంట్స్, సోషల్ మీడియాలో పెట్టవద్దని,
సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై గాని తప్పుడు, రెచ్చగొట్టే ఆరోపణలు చేసిన, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాద్యమాలు అయిన వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన,షేర్ చేసినా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాలని, లేదంటే తగిన పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అలా ఎవరైనా సామాజిక మాద్యమాలు అయిన వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన, షేర్ చేసినా వారి సమాచారాన్ని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కంట్రోల్ రూమ్ వాట్సప్ నెంబర్ కు 8712667100
తెలియజేయాలని అట్టి సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుంది.
ముఖ్యంగా యువత యొక్క బావి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నడుచుకోవాలని, సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టులు పెట్టి ఇబ్బంది పడవద్దని భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పోలీస్ కమిషనర్ శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు.
