Breaking News

గూడూరు స్టేట్ బ్యాంక్ అక్రమ నోటీసులపై విచారణ జరపాలి

337 Views

గూడూరు స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ మరియు ఐ.టి.డి.ఎ.శాఖ నెల్లూరు వారి ద్వారా 2017వ సంవత్సరంలో అరవై వేల రూపాయలు సబ్సిడీ,నలభై వేల రూపాయలు బ్యాంకు ఋణంతో కలిపి ఒక లక్ష రూపాయల ఋణంను మంజూరు చేసిన ఐటిడిఎ,నెల్లూరు శాఖ అధికారులు.
గూడూరు స్టేట్ బ్యాంకు వారు ఇవ్వవలసిన 40 వేల రూపాయలలో పది వేల రూపాయలు మాత్రమే సబ్సిడీతో కలిపి 70,000/- వేల రూపాయలను గూడూరు పూలతోట కాలనీ నివాసి నక్కల.హైమాకు అకౌంట్లో జామచేశారు.ఆడబ్బులతో తనకు వ్యాపారం జరుగే వస్తువులను కొనుగోలు చేసుకుని గూడూరు పాత బస్స్టాండ్ నందు వ్యాపారం చేసుకుంటున్న నక్కల హైమ. 15.08.2017 అర్ధ రాత్రి సమయంలో పాత బస్టాండ్లో ఉన్న హైమ సామానుల బండిని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టడం జరిగింది.ప్రక్కనే ఉన్న ఫైర్ స్టేషన్ సిబ్బంది చూసి ఫైర్ ఇంజన్ తో వచ్చి మంటలను అర్పివేశారు. అప్పటికే బండితో పాటు అందులో ఉన్న సమానులు కాలి బుడిదగా మారిపోయాయి.సంఘటన జరిగిన రోజున గూడూరు స్టేట్ బ్యాంకు అధికారులకు,ఐటిడిఏ నెల్లూరు శాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా తెలియజేసుకున్న నక్కల హైమా. బ్యాంకు లోను మంజూరు చేసే సమయంలో స్టేట్ బ్యాంకు ఇన్సూరెన్స్ కూడా స్టేట్ బ్యాంకు గూడూరు వారు కట్టించుకున్నారు.ఆ ఇన్సూరెన్స్ ను క్లయిమ్ చేసి నన్ను ఆదుకోవాలని లేఖలో వ్రాసుకున్న బాధితురాలు.త్వరలో ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే డబ్బులను అందజేస్తామని తెలిపిన బ్యాంకు అధికారులు. గూడూరు స్టేట్ బ్యాంకు చీఫ్ మేనేజర్ గా నాయక్ వచ్చారు.గూడూరు జిల్లా కోర్టు లో జరిగే లోక్ అదాలత్ కార్యక్రమంకు వచ్చి లోన్ డబ్బులు కట్టమని మొదట సారి నోటీసులు పంపించారు.హైమా గూడూరు కోర్టుకు వెళ్ళి తనకు జరిగిన సంఘటన గురించి జడ్జి కి విన్నవించుకున్న తర్వాత చీఫ్ మేనేజర్ ను పిలిపించి ఆమెకు రావలసిన ఇన్సూరెన్స్ ను ఇప్పించండి.మీకు రావలసిన 8 వేల రూపాయలను ఆమె కడుతుందని న్యాయమూర్తి తెలిపారు.అప్పటినుండి ఇన్సూరెన్స్ ఇవ్వలేదు.8 వేల డబ్బులకు నోటుసులు పంపలేదు.ప్రస్తుతం గూడూరు స్టేట్ బ్యాంకు మేనేజర్ 3 నోటుసులు పంపారు.30 వేలు కట్టమని.నాకు రావలసిన ఇన్సూరెన్స్ లక్ష రూపాయలు నేటికీ బ్యాంకు ఇవ్వలేదని ఆవేదనతో మాట్లాడుతున్న నక్కల.హైమా. ఇప్పటికైనా గూడూరు స్టేట్ బ్యాంకు అధికారులు నిరుపేద నక్కల సామాజక వర్గానికి చెందిన హైమాకు తగు న్యాయం జరిపించి ఆదుకోవాలని లేని యడల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త సంస్థ ను ఆశ్రయించి న్యాయం జరిగే వరకూ గూడూరు స్టేట్ బ్యాంకు,ఐటిడిఏ నెల్లూరు శాఖ అధికారులపై పోరాడుతానని హైమా తమ సంఘం నాయకులకు,విలేకరులకు తెలిపారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్