శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా శివుని చిత్రాన్ని 51కిలోల అక్షంతలను ఉపగించి భారీ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి శనివారం రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణాన్నికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తితో భగవంతుణ్ణి చిత్రాలు ఎన్నో రకాలుగా ఎన్నో చిత్రించానని చెప్పారు. గత సంవత్సరం బియ్యంతోను, పంచదార తోను, నానాలతోను చిత్రించాను. ఈ సంవత్సరం అక్షంతలను ఉపయోగించి చిత్రించానన్నాడు. భక్తులు శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శివుణ్ణి అభిషేకించి ముక్తిని పొందుతారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తెల్లవారు వరకు భజనలు చేస్తారన్నారు.
