రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలో శ్రీ సీతారాముల వారి నూతన రథం ప్రారంభించారు శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హోమం చేసి, సీతారాముల వారికి అభిషేకం నిర్వహించి, రథని కి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు, తదనంతరం శ్రీ సీతారాముల వారి మూర్తులను రథంపై గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు చేసి మహిళలు మంగళ హారతులతో కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి పెద్ద సంఖ్యలో భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగుతూ భజనలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ చైర్మన్ నాగేల్లీ పెద్ద శ్రీనివాసరెడ్డి, సభ్యులు సొనవేని రాజయ్య, ఉచ్చిడి శరత్ రెడ్డి సురేందర్ రెడ్డి,అంజల్ రెడ్డి,లక్ష్మ రెడ్డి, కిషోర్, మనోజ్,శరత్ రెడ్డి పవన్, కృష్ణ హరి, భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
