Breaking News

పసలేని ప్రగతి శంఖారావం # పాత సొల్లు ముచ్చట్లే తప్ప సభతో ఒరిగింది ఏమీ లేదు # ఎన్నికల్లో ఓడిపోతామని కాంగ్రెస్ ను తిట్ల పురాణం అందుకున్న సీఎం కేసీఆర్ # సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

104 Views

పసలేని ప్రగతి శంఖారావం

# పాత సొల్లు ముచ్చట్లే తప్ప సభతో ఒరిగింది ఏమీ లేదు

# ఎన్నికల్లో ఓడిపోతామని కాంగ్రెస్ ను తిట్ల పురాణం అందుకున్న సీఎం కేసీఆర్

# సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్

సిద్ధిపేట;

మెదక్ లో జరిగిన ప్రగతి శంఖారావంలో సీఎం కేసీఆర్ పసలేని మాటలతో సభ నడిచిందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల సందర్భంగా నిన్న మెదక్ లో ప్రగతి శంఖారావం పేరిట సభ నిర్వహించారని అన్నారు. సభలో కొత్త పథకాలు ఏమైనా తీసుకొస్తున్నారా అని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ప్రజలు వేచి చూశారని కొత్త ప్రకటన లేక పోగా పాత సొల్లు ముచ్చట తప్ప ఇంకేమీ చెప్పలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని బాధ కేసీఆర్ మాటల్లో కనబడిందని అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీపై టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై మండిపడ్డారని కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి సభ ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని అర్థమైందని సీఎం కేసీఆర్ బురిడీ చేష్టలకు ప్రజలు నమ్మరని అన్నారు. ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని నిరుద్యోగ భృతి దళితులకు మూడు ఎకరాలు స్థలం దళిత ముఖ్యమంత్రి ఇంటికో ఉద్యోగం ఇతర పథకాలు వాటిపై ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలోపట్టణ ప్రధాన కార్యదర్శి గ్యడారి మదు. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గ్యసౌద్దిన్.nsui. నాయకుడు రాకేశ్. రాషడ్. రాజు. తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *