గజ్వేల్, ఏప్రిల్ 1, 24/7 తెలుగు న్యూస్: 2 ఏప్రిల్ 2024 మంగళవారం రోజున ఉదయం 10:00 గంటలకు గజ్వెల్ లోని శోభ గార్డెన్ లో నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కలదు
ఇట్టి కార్యక్రమనికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు , మెదక్ ఎంపీ అభ్యర్థి పి . వెంకట్రాంరెడ్డి , ఎమ్మెల్సీ డాక్టర్యా యాదవ రెడ్డి , మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి హాజరుకానున్నారు.
కావున మాజీ చైర్మన్ లు ఎంపీపీ జడ్పీటీసీ , వైస్ ఎంపీపీ ,మండల సమన్వయ సమితి సభ్యులు, మండల పరిధిలోని అన్ని గ్రామాల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ఉపసర్పంచ్లు, మాజీ వార్డ్ మెంబర్లు, వివిధ కమిటీల మాజీ డైరెక్టర్లు మండల పార్టీ సీనియర్ నాయకులు
పార్టీ అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కార్యవర్గం, పార్టీ అనుబంధ కమిటీ కార్యవర్గ సభ్యులు,విద్యార్థి విభాగం నాయకులు, కార్యవర్గ సభ్యులు
యువజన విభాగం నాయకులు ,కార్యవర్గ సభ్యులు ,
పార్టీ మహిళా విభాగం నాయకులు,
రైతుబంధు సమితి గ్రామ శాఖ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు మరియు మీడియా ప్రతినిధులు అందరూ హాజరై సమావేశాన్ని విజయవంతం చేయగలరని వర్గల్ మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేలూరు వెంకట్ రెడ్డి తెలియజేశారు.




