కేసీఆర్ పై చిన్నారి అభిమానం
ఎల్లారెడ్డిపేట్ : ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయన ముఖచిత్ర పటాన్ని గీసి ఓ చిన్నారి తన అభిమానాన్ని చాటుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న సురభి ధనూజ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ముఖ చిత్రపటాన్ని గీసి అభిమానాన్ని చాటుకుంది. సీఎం కేసీఆర్ గారి పై ఉన్న అభిమానంతో ఆయన ముఖచిత్రపటాన్ని అచ్చంగా గీసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.




