ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 22,న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాయంత్రం 4 గం,,ల సమయంలో వేములవాడ రూరల్ పోలీస్ వారికీ వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీఐ బన్సీలాల్, రూరల్ ఎస్ ఐ నాగరాజు వారి సిబ్బందితో కలసి చెక్కపల్లి పెద్దమ్మ టెంపుల్ వద్దకు రూరల్ తహసీల్దార్ తో కలసి వెళ్లేసరికి అక్కడ ఇద్దరు వ్యక్తులు1) సముద్రాల విజయ్, నివాసం: ఉప్పర్ మల్యాల్, 2) నిమ్మల నితీష్ లు తమవద్ద ఒక ప్లాస్టిక్ బ్యాగ్ తో సహా నిలబడి వుండి పోలీస్ వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నం చేయగా పోలీస్ వారు వెంటనే వారిని పట్టుకొని వారివద్ద గల ప్లాస్టిక్ బ్యాగ్ ను పరిశీలించి చూడగా అందులో గంజాయిని కనుగొని తహసీల్దార్ సమక్షంలో విచారణ చేయగా ఆఇద్దరు వ్యక్తులు మరొక వ్యక్తి నాగం మహేష్ తో కలసి గతకొంత కాలంగా గంజాయి సేవించుటకు అలవాటుపడి, విజయ్ అనే వ్యక్తి నాందేడ్ లోని రైల్వేస్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకువచ్చి పై ముగ్గురు కలసి ప్రతి రోజు గంజాయి సేవించడమే గాక మిగతా గంజాయిని వారి గ్రామంలో మరియు పరిసర గ్రామాలలో యువకులకి గంజాయిని అమ్మి డబ్బులు సంపాదించి తమ చెడు అలవాట్లకు ఉపయోగించుకుంటున్నారు. అదేవిదంగా గత వారం మహేష్ అనే వ్యక్తి కి గంజాయి కొనుటకు డబ్బులు ఇవ్వగా విజయ్ నాందేడ్ కు వెళ్లి 1 కేజీ గంజాయి ని కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకువచ్చినాడు. ఈరోజు పై ముగ్గురు వ్యక్తులు ఇట్టి గంజాయిలో కొంత సేవించి మిగతా గంజాయి ని అమ్ముటకు గాను ముగ్గురు కలిసి పంచుకుందామని భావించి విజయ్ మరియు నితీష్ ఇద్దరు 1 కేజీ గంజాయిని తీసుకొని ఇక్కడకు వచ్చి నాగం మహేష్ కొరకు వేచించుస్తుండగా పోలీస్ వారు పట్టుకున్నారు. పై ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి 1 కేజీ గంజాయి, రెండు మొబైల్ ఫోన్స్ సీజ్ చేసి పై ఇద్దరు వ్యక్తులను వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కరీంనగర్ కోర్టుకు తరలించగా జడ్జి వారిని కరీంనగర్ జైలుకు తరలించినారు. పరారిలో వున్న మరొక వ్యక్తి నాగం మహేష్ ను త్వరలోనే పట్టుకొని అరెస్ట్ చేస్తామని రూరల్ సీఐ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా SP శ్రీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఇకపై గంజాయి సేవించేవారిపై రవాణాచేసే వారిపై ఎల్లవేళలా పోలీస్ వారి నిఘా ఉంటుందని వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ కూడా నమోదు చేయనున్నట్లు తెలిపారు..
