తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 69 జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రగతి సెంట్రల్ స్కూల్ లో ఏకంగా 18అడుగుల అతి భారీ చిత్రాన్ని 25కిలోల ఆవాలను ఉపయోగించి 5రోజులు శ్రమించి కేసీఆర్ చిత్రాన్ని అత్య అద్భుతంగా చిత్రించి గురువారం ఆవిష్కరించారు. కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గహిత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ చిత్రాన్ని ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆలోచనతో చిత్రిస్తానన్నాడు. గత 5సార్లు చిత్రించానని, ఓడ్లతో ఒకసారి, బియ్యంతో ఒకసారి, సబ్బుబిళ్ల మీద, సునేరుతో ఒకసారి, 100కిలోల పసుపు బియ్యంతో ఒకసారి. ఇప్పుడు అవాలతో రూపాన్ని అద్భుతంగా చిత్రించానన్నాడు. అభిమానులు తిలకించి మంత్రముగ్దులయ్యారు. ఆ కళాకారునికి అభినందనలు తెలిపారు. రైతు బాంధవునిగా పెరు గాంచిన కేసీఆర్ రైతు పండించిన అవాలతో చిత్రించడం కొసమెరుపు. అభిమానుల సందర్శనార్థం మూడు రోజులపాటు ప్రగతి స్కూల్ లో ఉంచనున్నట్లు రామకోటి రామరాజు తెలిపారు.

గ్రేట్ జాబ్, నైస్ ????????????