పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్
మాన్ సింగ్ గజ్వేల్ పాండవుల చెరువుని సందర్శించారు. ముందుగా కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ను సందర్శించి అనంతరం పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్ గజ్వేల్ చేరుకుని పాండవుల చెరువు కట్టపై ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్ బండ్లను, చెరువులో నీటి నిల్వ తదితర అంశాలను పరిశీలించారు.
పాండవుల చెరువు వద్ద స్థానిక మున్సిపల్ చైర్మన్ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తో పాటు ప్రజా ప్రతినిధులు అధికారులు పునరుద్ధరణ నీటి నిలువ పెరిగిన మత్స్య సంపద ఇతర అంశాలపై అధికారులు పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్ కు వివరించారు.
