శ్రీ నాచగిరి క్షేత్రములో గల శివాలయములో ఈ రోజు నుండి 57వ వార్షిక త్రిరాత్రి ఉత్సవములు ప్రారంభము అయినవి. కార్యక్రమములో భాగంగా ఈరోజు గణపతి పూజ పుణ్యాహవాచనము, రుద్రాభిషేకము అగ్ని ప్రతిష్ట రుద్ర సూర్య హోమములు, సాయంకాలము మంగళహారతి, మంత్రపుష్పము తీర్థ ప్రసాద వినియోగం జరుగును. 17 శుక్రవారం రోజున ఉదయము సహస్ర నాగవల్లి పూజ, నవగ్రహ పూజ, చంద్ర పూజ, రుద్ర హోమములు, మంగళహారతి, మంత్రపుష్పము, 18 శనివారము రోజున మహాశివరాత్రి సందర్భముగా రుద్రాభిషేకములు, బుధ గురు శుక్ర శని హోమములు, ఏకాదశ రుద్ర హవనము, సాయంకాలము 5 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవము, 10 గంటలనుండి లక్ష బిల్వ భద్ర పుష్ప పూజలు జరుగును. 19 ఆదివారం అందరికీ అన్నదాన కార్యక్రమం జరుగును.
