ప్రాంతీయం

నిరుపేద వధువుకు పుస్తె మెట్టెలు అందజేసిన ప్రజహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి

127 Views

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు ప్రజహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి. నిరుపేద వధువుకు పూస్తే మట్టెలు పంపిణీ చేసి మానవత్వపు చిరునామగా నిలుస్తున్న మోహన్ రెడ్డి. ఉమ్మడి మండల వ్యాప్తిగా అప్పన్న హస్తం, యువతకు ఆదర్శం, రేపటి ఆశా కిరణం. దుబ్బాక నియోజకవర్గంలో రాయపోల్ మండల పరిధిలోని ముంగాజిపల్లి ఎస్సీ కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన మద్దూరి శ్యామల స్వామి దంపతుల కుమార్తె రేవతి వివాహానికి దుబ్బాక నియోజవర్గం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి. వధువుకు పూస్తే మట్టెలు, పెళ్లి బట్టలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు పెద్ద రాష్ట్రాలకు అండగా నిలుస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలకు తోడ్పాటు చేస్తున్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధులకు పెన్షన్లు, ఒంటరి మహిళలకు పెన్షన్, గీత కార్మికులకు, అనేక వర్గాలకు అందుబాటులో ఉండేలా చేస్తున్న ఘనత కెసిఆర్ అని ఆయన పేర్కొన్నారు. వారి వెంట రాయపోల్ జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, వైసీపీ రాజిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, గ్రామ సర్పంచ్ రామ్మోల్ల స్వామి, గ్రామ అధ్యక్షులు ముత్యం, వార్డ్ మెంబర్ స్వామి, చంద్రం, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు లచ్చన్న, ఎంపీటీసీ వెంకటయ్య, బేగంపేట్ సర్పంచ్ ప్రవీణ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, శ్రీనివాస్ చారి, స్వామి, మంజూర్, శ్రవణ్, నర్సింలు, అర్జున్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *