ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 14, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్లాలోని పలు గ్రామాల నుండి గ్రామ పంచాయితీ సపాయి కార్మికులు, గూడ్స్ మరియు పాసింజర్ ఆటో యూనియన్లు, బీడీ కార్మికులు మరియు అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ తోట ధర్మేందర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలి. ESI హాస్పిటల్ లో ప్రతి కార్మికుడికి ఉచిత వైద్యం అందించేలా చూడాలి. ప్రతి కార్మికుడి పిల్లలకు విద్యలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని మరియు వివిధ రకాల సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వాలు చూడాలని లేని పక్షంలో తెలంగాణలో అసెంబ్లీని, డిల్లీలో పార్లమెంట్ ని ముట్టడిస్థామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జల లక్ష్మణ్ శ్రీనివాస్ రజాక్ మౌలానా నరేష్ పోచయ్య బాల పోచవ్వ రాజు నరసవ్వ బాల లక్ష్మి రాజయ్య లక్ష్మి బిక్షపతి సత్యప్ప రాజేందర్ ప్రశాంత్ మరియు భారతీయ మస్దూర్ సంగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
