అమరుడు ఈశ్వర చారి కి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించిన బీసీ సంఘం నాయకులు
ఈరోజు బెల్లంపల్లి చౌరస్తాలో బీసీలకు జరిగిన అన్యాయంపై కలత చెంది నిన్న మేడ్చల్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకి పాల్పడిన ఈశ్వర చారి నిన్న గాంధీ హాస్పిటల్ లో నిన్న గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందడం బీసీ సమాజానికే బాధాకరం ఆయన అమరత్వం బీసీ సమాజానికి కనువిప్పు కలగాలని ఆయన ఆశయ సాధన కోసం రాబోయే రోజుల్లో రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా మా ఉద్యమాలు ఉంటాయని ప్రతిజ్ఞ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మరియు అన్ని ప్రధాన పార్టీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఆడిన రాజకీయ చదరంగంలో ఈశ్వర చారి ఆత్మబలిదానంతో నైనా ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పటికైనా కనువిప్పు కలిగించుకొని బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని అలాగే ఈశ్వర చారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.అలాగే వీరమరణం పొందిన ఈశ్వర చారి దేహాన్ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు మంత్రులు కావచ్చు అలాగే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ బిజెపి నాయకులు సందర్శించకపోవడం మాట్లాడకపోవడం అంటే మూడు పార్టీల యొక్క ధమన నీతిని ఖండిస్తున్నాం .ఇప్పటికైనా ఈ పార్టీలు రిజర్వేషన్ల విషయంలో తమ చిత్తశుద్ధిని నిరూపించుకొని 42 శాతం రిజర్వేషన్ సాధనకై అన్ని పార్టీలు కట్టుబడి ఉండాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ బీసీ నాయకులు వెంకటయ్య జిల్లా ఉపాధ్యక్షుడు విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుండోజు రమేష్, రాజన్న చారి, చంద్రగిరి చంద్రమౌళి, ధర్మాజీ మల్లేష్, కీర్తి బిక్షపతి ,కొట్టే నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.





