అబద్దపు హామీలిస్తూ మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ప్రజలు ప్రశ్నించాలని బిజెపి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ప్రజాగోస-బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సింగాపూర్ లో మంగళవారం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ సుష్మాస్వరాజ్ జయంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. అనంతరం పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు నిమిషం పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సమ్మిరెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ధరణి పోర్టల్ వల్ల నిజమైన పట్టాదారులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. అనవసరమైన పథకాలు ప్రవేశ పెట్టి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.గ్రామాల్లో దళితులకు దళిత బందు రావడం లేదని అన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామ పంచాయితీలు మనుగడ సాగిస్తున్నాయని తెలిపారు.భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యం లోని కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నారని తెలిపారు.అర్హులైన వారందరూ ఈ శ్రమ్ కార్డులను తీసుకోవాలని సూచించారు.పేద ప్రజలందరికీ ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్న ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేనని తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, స్థానిక ఎమ్మెల్యే రసమయి పట్టింపులేకుండా పరిపాలన సాగిస్తున్నాడని ఆరోపించారు.ఫామ్ హౌస్ లు కట్టుకొని ఆస్తులు కూడగట్టుకుంటున్నాడని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,శక్తికేంద్ర ఇంచార్జి బోనాల మోహన్,మండల ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు ఒడ్నాల రవీందర్,ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్, కిసాన్ మోర్చా జిల్లా ఈసీ మెంబర్ పాశం రాఘవరెడ్డి,బూత్ అధ్యక్షులు అల్లెపు కుమారస్వామి,పడాల సారయ్య, సీనియర్ నాయకులు ఒడ్డేపల్లి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.