నిరుపేద వధూవరులకు పుస్తె మట్టెలు, పెళ్లి దుస్తులు అందజేసి పేదింటి పెళ్లికి పెద్దదిక్కుగా నిలుస్తూ, పేద ప్రజలకు చేయూతను అందించడంలో ప్రతి ఒక్కరు ముందుండాలని సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. గురువారం మిరుదొడ్డి మండల కేంద్రం, లింగుపల్లి గ్రామాలలో నిరుపేద వధువులకు పుస్తె మెట్టలు పెళ్లి బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలను అందించడం జరుగుతుందన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన నిర్మల అంజయ్య దంపతుల కూతురు సంపూర్ణ మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామానికి చెందిన గుండిగారి లతా రాజు దంపతుల కూతురు అనూష ఇద్దరూ వధువులకు పుస్తె మెట్టెలు పెళ్లి దుస్తులు అందజేయడం జరిగిందన్నారు. ఆడపిల్లలు పెళ్లి చేయాలంటేనే ఎంతో ఖర్చుతో కూడుకొని ఉన్నదని నిరుపేద కుటుంబాల తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారిందని అలాంటి పరిస్థితులు ఉన్న కుటుంబాలకు మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరు పేద చేయూతను అందించాలని కోరారు. సామాజిక సేవకురాలు సుల్తానా ఉమర్ దంపతులు నిరుపేద కుటుంబాలకు చేస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని గ్రామస్తులు అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఆపదలో ముందు ఉంటూ చేయూతను అందించడం అభినందనీయమని కొనియాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇప్పటికే ఎంతోమందికి నిత్యవసర సరుకులతో పాటు ఆర్థిక సహాయం అందజేసిన సుల్తానా ఉమర్ దంపతులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సేవకులు సేవకులు మహమ్మద్ ఉమర్, జర్నలిస్టు మహేష్, మంజీరా దళిత సేవా సమితి జిల్లా అధ్యక్షులు కిరణ్, గ్రామస్తులు రాజు, అశోక్, స్వామి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
