ఆధ్యాత్మికం

కైలాసపురం రేణుక మాత  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ 

215 Views

 

 

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచారం శ్రీ  రేణుక ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాచారం సర్పంచ్ కొండం అరుణ అశోక్ రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఏక బిల్వ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ మా కాచారం గ్రామంలో వెలసిన శ్రీ రేణుక మాత దేవాలయం  అరణ్యవాసంలో వెలసిన ఈ దేవాలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఆలయ అర్చక స్వామి డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఇటీవల భక్తి రత్న అవార్డు, డాక్టరేట్ పట్టా స్వీకరించడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, జిల్లా పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు పాశకంటి కంటి శ్రీనివాస్, అయ్యగారు మంచాన హరినాథ్ శర్మ, శివ భక్తులు బచ్చు గణేష్ గుప్తా, బైరి ప్రభాకర్ అలైక్య, భక్తులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *