ప్రాంతీయం

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి… – సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్.

174 Views

వేలకి వేల రూపాయలు డబ్బులు చెల్లించి కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొందలేని నిరుపేద ప్రజల కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. మంగళవారం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి రిఫ్రిజిరేటర్ బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగి ఆరోగ్యవంతమైన నవ సమాజం నిర్మాణమైనప్పుడే నిజమైన నైతిక అభివృద్ధి చెందినట్లని ప్రభుత్వాలు ప్రజా ఆరోగ్యం కోసం పాటుపడుతూ ఆ దిశగా ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. నిరుపేద ప్రజలు కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రులలో వేల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకోలేని పరిస్థితులలో చాలామంది ఉన్నారని, ఆరోగ్యం పేరు మీద అతిపెద్ద వ్యాపారం జరుగుతుందన్నారు. ఎన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టినప్పటికీ ఆరోగ్యవంతమైన మానవ వనరులు లేకుంటే దేశ అభివృద్ధి జరగదన్నారు. దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారని పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించేందుకు ఆసుపత్రికి తన వంతుగా రిఫ్రిజిరేటర్ ను డాక్టర్ హేమ్రాజ్ సింగ్ కు అందజేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మెడిసిన్ భద్రపరిచేందుకు. రిఫ్రిజిరేటర్ లేదని తెలియడంతో, తన వంతుగా సహకారంగా రిఫ్రిజిరేటర్ ను అందించడం జరిగిందని వెల్లడించారు. రోగులకు అవసరమయ్యే మెడిసిన్ భద్రపరిచేందుకు ఫ్రిడ్జ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. పేద ప్రజలకు సహాయం చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం కోసం వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తన వంతు సాయం అందించడం జరిగిందన్నారు. ఆస్పత్రి అభివృద్ధిలో భాగస్వాములైన అంగన్వాడి టీచర్ సుల్తాన ఉమర్ కు డాక్టర్ హేమ్రాజ్ సింగ్, వైద్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు మహమ్మద్ ఉమర్, రాయల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *