ఆధ్యాత్మికం

ఇంతకు గుడి నిర్మాణం ఎప్పుడు!

105 Views

ఇంతకు గుడి నిర్మాణం ఎప్పుడు!

30 లక్షల కంట్రిబ్యూషన్ చెల్లిస్తే మరో కోటి ఇరువై లక్షలు మంజూర్ ఇస్తామంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం

మొత్తం మూడు కోట్ల రూపాయలతో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిర్మాణానికి టెండర్లు పిలుస్తామన్న రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు

ముప్పై లక్షల కంట్రిబ్యూషన్ కట్టక ఆగిపోయిన గుడి నిర్మాణం

గత ఆరు మాసాలుగా బాలాలయంలో నిత్య పూజ లందుకుంటున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి

నాయకులపై మండిపడుతున్న గ్రామస్తులు

ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 23 :

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని మూడు కోట్ల రూపాయల తో పునాఃనిర్మానం చేపడుతామని బిఆర్ఎస్ పార్టీ నాయకులు జూన్ నెలలో చెప్పి గ్రామ పంచాయతీ కి ఎదురుగా ఉన్న పాత శివాలయం ప్రక్కన బాలాలయం నిర్మించి వేద పండితులు మంత్రోచ్చాల మధ్య శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ని ప్రతిష్టించారు,
ప్రతిష్టించి ఏడు మాసాలు గడుస్తున్న గుడి నిర్మాణం గురించి పట్టించుకునే నాథుడే లేడు ,
ఇదేంటి అని ఎవరైనా అడుగుతే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఐవి సుబ్బారెడ్డి తో మన ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడి మొదటి విడతగా ఒక కోటి ఎనబై లక్షల రూపాయలు మొదటి విడుతగా మంజూరు చేయించారు రాష్ట్ర దేవాదాయ శాఖ కు జమ చేశారు, 30 లక్షల రూపాయల కంట్రీ బ్యూషన్ చెల్లిస్తే ఒక కోటి 20 లక్షల రూపాయలు రెండవ విడుత మంజూరు ఇప్పిస్తామని తిరుపతి తిరుమల దేవస్థానం వారు అంటున్నారు మొత్తం మూడు కోట్లతో టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్ ద్వారా పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులు అంటున్నారు,
30 లక్షల రూపాయల కంట్రీబ్యూషన్ చెల్లించడానికి ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి బాలాలయంలోనే నిత్య పూజలు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ,
గుడి నిర్మాణంలో తీవ్ర జాప్యం చేయడంతో గ్రామస్తులు బిఆర్ఎస్ పార్టీ నాయకుల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,
ఇప్పటికైనా కంట్రీ బ్యూషన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెల్లిస్తారా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు చెల్లిస్తారా లేదా గ్రామంలో చెందాలు వసూలు చేసు కొమ్మాంటారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు
30 లక్షల రూపాయలు మాజీమంత్రి కేటీఆర్ సొంతంగా కంట్రిబ్యూషన్ ఇస్తామని అన్నారని మాజీ దేవస్థానం చైర్మన్ నందికిషన్ అంటుండగా కంట్రిబ్యూషన్ విషయంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో ఇంచార్జి కెకె మహేందర్ రెడ్డి తో మాట్లాడినట్టు నూతన దేవస్థాన కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్, ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్ అంటున్నారు,
ఇంతకు ఆలయనిర్మాణం జరిగేనా 30 లక్షల రూపాయల కంట్రిబ్యూషన్ చెల్లించేది ఏవరు అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7