ప్రాంతీయం

అమ్మవారి దయవల్ల నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలి – నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి

69 Views

దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపారు దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు. తొగుట మండల కేంద్రంలోని ఆయన నివాసంలో కలసి జమ్మి ఇచ్చి ఆలింగనం చేస్కొని శుభాకాంక్షలు తెలిపారు నాయకులు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సుఖశాంతులతో నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగ ఉండాలన్నారు. జన సంక్షేమానికి ప్రజా ప్రభుత్వ సంకల్పం విజయపథాన సాగి విశ్వ వేదిక పై తెలంగాణ సగర్వంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐలపురం కనకయ్య యాదవ్, దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు పడాల రాములు, రాయపోల్ మండల అధ్యక్షుడు తప్పెట సుధాకర్, దౌల్తాబాద్ ఉపాధ్యక్షుడు మద్దెల స్వామి, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి, సీనియర్ నాయకులు కిష్టారెడ్డి, మల్లేష్ యాదవ్ (పిఎంపి) తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found