మంచిర్యాలలో సి.ఎస్.ఐ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ పండగ వేడుకలు
మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని హమాలివాడ, ఎంసీసీ సి ఎస్ ఐ చర్చిల్లో మరియు లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలోని మీషన్ కాంపౌండ్ మరియు ఉత్కూర్ చౌరస్తా సి.ఎస్.ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని చిన్నారులతో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.అనంతరం చర్చి పాస్టర్ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కి ఆ ఏసుక్రీస్తు దేవుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండి మంచిర్యాల నియోజకవర్గాన్ని ఇంకా మరెన్నో అభివృద్ధి పనులను చేయాలని ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా సురేఖ నీ చర్చి కమిటీ సభ్యులు శాలువతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..





