గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలి కలెక్టర్ ప్రశాంత్ పట్టణం చుట్టూ జరుగుతున్న నాలుగు వరుసల రింగ్ రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రింగ్ రోడ్డు చుట్టూ దాదాపు 22కి.మి కార్లో తిరిగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువు లోపు ఖచ్చితంగా పనులు పూర్తి చేయాలనీ నిర్మాణ ఏజెన్సీ ఆర్ఎన్ కన్ స్ట్రక్షన్ అధికారులకు తెలియజేశారు. పనుల్లో అలసత్వం పనికిరాదని ఎలాంటి అవరోధాలు ఎదురైన ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయ్యాలన్నారు. చౌరస్తా, రింగ్ రోడ్డు డివైడర్ మద్యలో మరియు రెండు పక్కల పెద్ద పెద్ద చేట్లను పెట్టించి గ్రీనరిగా ఒక వరుసలో పూల మొక్కలు పెట్టి అందంగా కనిపించేలా తిర్చిదిద్దాలని ప్లాంటేషన్ కాంట్రాక్టర్ కి తెలిపారు. ఈ ప్లాంటేషన్ పనులను రోజు వారిగా పర్యవేక్షణ చేయ్యాలని గజ్వేల్ గడా స్పెషల్ అధికారి ముత్యంరెడ్డి కి తెలిపారు. ఆర్&బి మరియు ఆర్ఎన్ కన్స్ట్రక్షన్ అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరగా పూర్తి చెయ్యాలని ఆదేశించారు. చౌరస్తా మద్యలో సెంట్రల్ లైటింగ్, కాటిల్ బోర్డు, ఐమాక్స్ లైట్లు, ఇలా ప్రతిదీ ఉండేలా చూసుకోవాలి.కలెక్టర్ వెంట ఆర్&బి ఈఈ సుదర్శన్ రెడ్డి, డిఈ రామక్రిష్ణ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ చైర్మన్ రాజమౌళి గుప్త, ఎజెన్సీ బృందం తదితరులు ఉన్నారు.