ప్రాంతీయం

రిటైర్ సింగరేణి కార్మికులకు ఫిబ్రవరిలో కొత్త పెన్షన్

50 Views

మంచిర్యాల జిల్లా, మందమర్రి.

రిటైర్ సింగరేణి కార్మికులకు ఫిబ్రవరిలో కొత్త పెన్షన్.

2021 నుంచి 2024 మధ్యలో సింగరేణిలో రిటైర్మెంట్ అయినా కార్మికులకు 11వ వేచి బోర్డు పెన్షన్తో పాటు ఏరియర్స్ వెంటనే చెల్లించాలని మందమర్రి సింగరేణి రిటైర్మెంట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో రీజినల్ కమిషనర్ పచోరి కి వినతి పత్రాన్ని అందజేశారు అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ పోయిన నెల 19వ తారీఖున మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయానికి విచ్చేసినప్పుడు మొదటిగా సింగరేణి. రిటైర్మెంట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. అప్పుడు పది రోజుల్లో చెల్లించేందుకు ఆయన మాట ఇచ్చారు కానీ ఇచ్చిన గడువు దాటిపోయిన కూడా కార్మికులకు చెల్లించకపోవడంతో నిన్న గోదావరిఖనిలో ఆయన చాంబర్లో కలిసి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్ తో పాటు ఏరియాస్ ను కూడా చెల్లించేందుకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గోదావరిఖని రీసన్లలో సుమారు నాలుగువేల పెన్షన్లు ఉంటే అవి ఇప్పటివరకు రెండు వేలు మాత్రమే. వెరిఫికేషన్ చేశారు మిగతావి కూడా పూర్తిచేసి ఫిబ్రవరిలో చెల్లించేందుకు కృషి చేస్తారని వారన్నారు.

ఈ కార్యక్రమంలో వినతిపత్రం అందించిన వారిలో సింగరేణి. రిటైర్మెంట్ కార్మిక సంఘం మందమర్రి పట్టణ అధ్యక్షుడు వాసాల శంకర్. వైస్ ప్రెసిడెంట్ జక్కం రాజయ్య అలాగే శనిగారపు రాజేష్. ప్రచార కార్యదర్శి లు దాసరి ఎల్లారం. నాయిని శంకర్. కోశాధికారి ఆసం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్