ప్రాంతీయం

అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా చేయడమే సీఎం కప్పు ఉద్దేశం

11 Views

అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా చేయడమే సీఎం కప్పు ఉద్దేశమని జిల్లా కలెక్టర్, స్పోర్ట్స్ చైర్పర్సన్ హైమావతి అన్నారు

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7

గ్రామీణ ప్రాంత క్రీడాకారులను గుర్తించి అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా చేయడమే సీఎం కప్పు ఉద్దేశమని జిల్లా కలెక్టర్, స్పోర్ట్స్ చైర్పర్సన్ హైమావతి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలో ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం క్రీడాకారులను వారిలో దాగి ఉన్న ప్రతిభ పాటలను వెలికి తీయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పోటీల నిర్వహణను చేపడుతుందని అన్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత పి. ఈ.టిల పైన ఉన్నదని చెప్పారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా ఏదో ఒక క్రీడలలో పాల్గొనాలని సూచించారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని తెలిపారు. టీం స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని చివరి అవకాశం వరకు కలుపు కోసం క్రీడాకారులు కృషి చేయాలని అన్నారు. సిద్దిపేట జిల్లా క్రీడల్లో ముందుందని క్రీడ ఉపాధ్యాయుల సలహాలు, సూచనలను తీసుకొని మరింత ప్రాక్టీస్ చేసి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి సిద్దిపేట బ్రాండ్ ను కొనసాగించాలని క్రీడాకారులకు సూచించారు. వచ్చే సంవత్సరం తప్పనిసరిగా వ్యాయామ విద్య పీరియడ్లకు ఉండేటట్టుగా చర్యలు చేపడుతున్నట్టుగా చెప్పారు. సీఎం కప్ సిద్దిపేట జిల్లా స్థాయి క్రీడోత్సవాలు ఈనెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తాను విద్యార్థి దశలో జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించిన విషయాన్ని గుర్తు చేశారు.జిల్లా యువజన యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య మాట్లాడుతూ ఈ పోటీలపై విస్తృత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా సీఎం కప్ టార్చ్ ర్యాలీని జనవరి 7 నుండి జిల్లాలో నిర్వహించడం జరిగింది. పర్యవసరంగా జిల్లా వ్యాప్తంగా 17వేల మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది అని చెప్పారు.. ఇప్పటివరకు గ్రామ క్లస్టర్ మండల్ నియోజకవర్గ స్థాయిలలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. విజేతలకు బహుమతులు అందించడం జరిగింది. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి దశకు ఎంపిక చేయడం జరిగింది. వివిధ దశలలో జిల్లాలోని మండల అధికారులతో పాటు జిల్లా క్రీడా సంఘాలు, వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సహకారంతో విజయవంతంగా పోటీలు నిర్వహించడం జరిగింది. సిద్దిపేట, గజ్వేల్, కొండపాక కేంద్రాలలో 21 క్రీడాంశాలలో మూడు రోజులపాటు పోటీలు జరుగుతాయి.ఈ జిల్లా స్థాయి పోటీలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలో పాల్గొనే సిద్దిపేట జిల్లా జట్లకు ఎంపిక చేయడం జరుగుతుంది. రాష్ట్రస్థాయి పోటీలో విజేతలుగా నిలిచే క్రీడాకారులకు,స్వర్ణ పతకానికి 25000 రజతానికి 15000 కాశ్య పతకానికి పదివేల రూపాయలుప్రభుత్వం అందజేయడం జరుగుతుంది చెప్పారు..ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు జెడ్పి సీఈవో రమేష్, డీఎస్సీడీవో హమీద్, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ రవి నాయక్, పాఠశాలలో క్రీడా కార్యదర్శి సౌందర్య, వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు అశోక్, కార్యదర్శి హరికిషన్, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, క్రీడా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.. అనంతరం పోటీల ప్రారంభ సూచికంగా శాంతి కపోతాలు ఎగరవేసారు.. కాగా నేడు బాలుర విభాగంలో కబడ్డీ ,వాలీబాల్ ,కోకో, ఫుట్బాల్, హ్యాండ్ బాల్ పోటీలతో పాటు వ్యక్తిగత క్రీడా క్రీడాంక్షన్లో పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకుల తెలిపారు…

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *