విద్య

సాంస్కృతిక కార్యక్రమాల వేదిక కి విరాళం అందజేసిన భేతి మల్లేశం…

143 Views

 

సాంస్కృతిక కార్యక్రమాల వేదిక(స్టేజి) కి విరాళం అందజేసిన భేతి మల్లేశం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లో సాంస్కృతిక కార్యక్రమాల వేదికను ఏర్పాటు చేయుటకై బేతి మల్లేశం మరియు వారి కుమారులు బేతి శ్రీనివాస్, బేతి వేణు లు వారి మాతృమూర్తి కీర్తిశేషులు బేతి రాధమ్మ జ్ఞాపకార్థం సహృదయంతో 30 వేల రూపాయల నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయులు
మురళీధర్ కు విరాళంగా అందజేసినారు.

అదేవిధంగా 2022-2023 విద్యా సంవత్సరంలో పదవ తరగతి వార్షిక పరీక్షలలో అత్యున్నత ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి రూ.5000 ల నగదును, అలాగే ద్వితీయ స్థానం పొందిన విద్యార్థికి ₹3,000 నగదును అందిస్తామని తెలియ చేశారు.

ఈ సందర్భంగా బేతి మల్లేశం మరియు వారి కుమారులను గ్రామ సర్పంచ్ పాశం సరోజన దేవ రెడ్డి గారు, ఎస్ఎంసి చైర్మన్ గోగూరి శ్రీనివాస్ రెడ్డి , వార్డ్ మెంబర్ పాటి దేవయ్య
పాఠశాల ప్రధానోపాధ్యాయులు
పి. మురళీధర్   ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *