ముస్తాబాద్, డిసెంబర్ 29 (24/7న్యూస్ ప్రతినిధి): గూడూరు గ్రామశాఖ అధ్యక్షులు చాకలి బాబు ఆధ్వర్యంలో బత్తిని శెంకయ్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన సహాయనిధి 21.వేల రూపాయలగల చెక్కును గూడూరు గ్రామంలో బాధితునికి అందించారు. ఈ కార్యక్రమంలో చాకలి బాలు, కాసులవాద శ్రీను, భూపెల్లి దుర్గయ్య, బత్తిని అనిల్, చెక్కపల్లి నరసయ్య, చెక్కపల్లి బాను, చెక్కపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.




