హైదరాబాద్ నుండి నేడు ఎల్లారెడ్డిపేట కు బయలుదేరిన గంగపుత్రులు*.ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఎల్లారెడ్డిపేట లో జరుగుతున్న పోచమ్మ గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ కు బోనాలు సమర్పించడానికి గంగపుత్రులు సుమారు 50 కుటుంబాలు ఎల్లారెడ్డిపేట కు మినిబస్ లో బయలుదేరారు. మొదట వీరు పోచమ్మకు,వారి కులదైవం గంగమ్మకు బోనాలు,మైసమ్మ దుర్గమ్మకు బోనాలు సమర్పించనున్నారు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆహ్వానంమేరకు వీరంతా హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డిపేటకు బయలుదేరారు.హైదరాబాద్ నుండి వస్తున్న గంగపుత్రులకు సర్పంచ్ వెంకట్ రెడ్డి ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెంటన్ పద్మయ కోశాధికారి మానుకోల దేవదాసు సలహాదారు మానుకోల సుధాకర్ గంగపుత్రుల కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం తిరిగి వారి వారి కుటుంబాలు హైదరాబాద్కు వెళ్లడానికి సిద్ధమయ్యారు
