శ్రీ దుర్గా మాత శోభయాత్ర ప్రారంభం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ ఆలయం నుండి శోభాయాత్ర ప్రారంభం అయింది శనివారం రోజున రాత్రి 9:00 నుండి తెల్లవారుజాము వరకు ఊరేగింపు నిర్వహిస్తున్నారు పోతరాజుల విన్యాసాలు బైండ్ల డప్పుల చప్పుడు మరియు గ్రామ దేవత గ్రామదేవతల ఊరేగింపు మహిళలు బోనాలు ఎత్తుకొని శోభాయాత్రగా అన్ని కులాల ఐక్యతతో పండగ వాతావరణం విజయవంతంగా నిర్వహించి బయలుదేరారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది అనంతరం గ్రామదేవతల పున ప్రతిష్ట కట్ట మైసమ్మ మైసమ్మ దుర్గమ్మ దేవతలకు గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు పోతరాజుల విన్యాసాలు డప్పు చప్పులతో నృత్యాలతో గ్రామంలో సందడి చెలరేగింది పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు
