కళారత్న రాష్ట్రస్థాయి అవార్డ్ వచ్చిన శుభ సందర్భంగా శనివారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ వ్యస్థాపకులు వంగపల్లి అంజయ్య గురుస్వామి రామకోటి రామరాజును జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకోటి రామరాజు రకరకాలుగా చిత్రాలు చిత్రించడంలో అతనికి అతనే సాటి అన్నారు. దేశ నాయకుల నుంచి మొదలుకొని భగవంతుని చిత్రాలు చిత్రించి వేలాది మంది అభిమానాన్ని పొందడం చాలా గొప్ప విషయమన్నారు. నేడు రాష్ట్ర అవార్డ్ పొందడమే కాదు, మరెంతో ఉన్నత శిఖరాలను ఎదగాలని కోరారు. భగవంతుని చిత్రాలే కాకుండా భగవన్నామాన్ని కూడా లక్షలాది మంది భక్తులతో రామ నామాల్ని పలికించడం లికింపజేయడం అభినందనీయమని అన్నారు. అలాగే రామకోటి రామరాజు మాట్లాడుతూ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించనున్న సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేయడం జరిగిందని ప్రజలని భక్తి మార్గం వైపు మొగ్గు చూపే విధంగా కృషి చేస్తూ సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ అందరి మన్నన పొందిన అంజయ్య స్వామి అభినందనీయులు అని రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు రేణుకా ఎల్లమ్మ కల్యాణంలో పాల్గొనలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసి సుగుణ రాంరెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ కాయితి కొండల్ రెడ్డి, చింతపండు బీమయ్యా, కాచారం గ్రామస్తులు పాల్గొన్నారు