జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో పురాతన శివాలయంలో శనివారం గణపతి పూజ, స్థాపిత మంటప దేవతాపూజ, హావనము, అభిషేకం, తదితర పూజలు నిర్వహించారు. వేద పండితుల మధ్య ప్రతిష్ఠోత్సవాలు ఆంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ యాదవరెడ్డిలు మాట్లాడుతూ ఆదివారం ఉ 8.00 గంటల నుండి గణపతి పూజ, స్థాపిత దేవతాపూజ, పోవనము, గర్త సంస్కారము ఉ: 9.42 గంటలకు విగ్రహప్రతిష్టాపనము బలిహారణము. పూర్ణాహుతి కలశోద్వాసన విశేషపూజ, శివపార్వతుల కళ్యాణం మహాదాశీర్వచనము తీర్ధప్రసాద వితరణము, ఆదివారం అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిటీసి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కమిటీ సభ్యులు జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు
