శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణమాసం మొదటి శుక్రవారం రోజున తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాలయంలో మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించారు.మహిళలు లక్ష్మీదేవిని అలంకరించి నగదు, బంగారు ఆభరణాలను హారాలుగా చేసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పెద్దవారి నుంచి ఆశీర్వాదాలు స్వీకరించారు.అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ మేడిపల్లి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
