ప్రాంతీయం

సహకార సంఘాల ద్వారా రైతులకు మేలు

79 Views

– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
– దౌల్తాబాద్‌లో పీఏసీఎస్ భవనం ప్రారంభం

దౌల్తాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు అందుబాటులో ఉంటూ ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డితో కలిసి మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని అన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలను అందించే విధంగా సహకార సంఘాలను ప్రోత్సహించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని రైతులకు సాగు నీటిని అందించేందుకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. వేసవిలో సైతం చెరువుల్లో, వాగుల్లో జలకళ సంతరించుకోవడం కేసీఆర్ కృషియేనని కొనియాడారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగాదరి సంధ్య రవీందర్, జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు రహీమొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, సీఈవో మల్లేశం తదితరులు పాల్గొన్నారు…

Oplus_131072
Oplus_131072
Jana Santhosh