ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 10,
ముస్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం ఎస్సీ మాదిగ కుల సంఘం ఎన్నికలు నిర్వహించారు .
ఈ ఎన్నికలలో అధ్యక్షులుగా దుబ్బాక రాజు, ఉపాధ్యక్షులుగా సంచు కృష్ణ , ప్రధాన కార్యదర్శిగా ముక్క మల్లయ్య , క్యాషియర్లుగా గద్దల భాస్కర్ , మాడూరి బాబు , సంయుక్త కార్యదర్శిగా కొల్లూరి నర్సింలు, కార్యదర్శులుగా మెరుగు మల్లయ్య , సుంచు ఎల్లయ్య, ఎడ్ల వెంకటయ్య , శీలం వెంకటేష్ , కటుకూరి నరేష్ , జిల్లాల దేవయ్య , సుంచు శంకర్ లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు.
ఈ సమావేశంలో సంఘం నూతన అధ్యక్షులు దుబ్బాక రాజు మాట్లాడుతూ …
ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపారు.
సంఘం అభివృద్ధి కోసం మనసా వాచా కర్మణా పనిచేస్తానని ప్రమాణం చేశారు .
మాదిగ కులంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా పనిచేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కులస్థులు పెద్దలు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .




