సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండల్ మంతుర్ గ్రామంలోని ఇటీవల వివిధ కారణాలతో మరణించిన ఎండి సంజు, సాకలి లింగం కొడుకు మురళి దాస్, మరియు జోడు రామయ్య, పట్నం మల్లయ్య కుటుంబాలను దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి వెంట రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, మండల మైనార్టీ సెల్ నాయకులు జాఫర్, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, కో ఆప్షన్ పర్వేజ్, మంతుర్ గ్రామ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, ఉప సర్పంచ్ రూప నర్సింలు, బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సంతోష్, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, టెంకంపేట నర్సింహులు, యాదగిరి, జగపతి రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, దొమ్మాట యువజన నాయకులు నరా రాజేందర్, స్వామి, ఎల్లం, జీవన్, చిరంజీవి, నారం రెడ్డి, జాంగిర్ షాదుల్, శ్రీనివాస్ చారి అర్జున్ తదితరులు ఉన్నారు.
