ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్11, సిరిసిల్లలో ఈనెల 17న జరగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి – ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎంపీపీ జనగామ శరత్ రావు నివాసంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో సన్నాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కెసిఆర్ రాకను మన బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సభను విజయవంతం చేయాలని కేటీఆర్ మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రణాళికతో జాగ్రత్తగా వ్యవహరించాలని పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, మాజీలు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మహిళా సబ్యులు తదితరులు పాల్గొన్నారు.




