కొమురవెల్లి గ్రామంలో 29.11.2025 న జరిగిన చోరీ–స్నాచింగ్ కేసు (క్రైమ్ నం: 152/2025)ను కొమురవెల్లి పోలీస్ అధికారులు వేగంగా ఛేదించి, నిందితుడిని అరెస్టు చేశారు.
— స్టేషన్ హౌస్ ఆఫీసర్,
కొమురవెల్లి పోలీస్ స్టేషన్ మహేష్
సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 9, తెలుగు న్యూస్ 24/7
29.11.2025 న ఓ మహిళపై స్నాచింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, విచారణను ప్రారంభించారు. విచారణలో భాగంగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి, ఆధారాలను సేకరిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నమ్మకమైన సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుడు తిగుళ్ల రాజనీకాంత్ ను అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకోగా, అతని వద్ద నుండి దొంగిలించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరు పరచగా, జ్యూడిషియల్ రిమాండ్‌లోకి పంపించారు.ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నట్లు ( ఎస్ హెచ్ ఓ ) తెలిపారు.





