Breaking News

పేద ప్రజల బాగు కోసం అనేక సంక్షేమ పథకాలు – కౌన్సిలర్ పంబాల అర్చన శివకుమార్

142 Views

 

 

కంటి వెలుగు కార్యక్రమం బృహత్తర కార్యక్రమం అని కౌన్సిలర్ పంబాల అర్చన శివ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని 4 వ వార్డులో ప్రభుత్వ పాఠశాలలో గురువారం కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ తో కలిసి ప్రారంభించిన కౌన్సిలర్ పంబాల అర్చన శివకుమార్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ఒక చక్కని కార్యక్రమం అని సీఎం కేసీఆర్ పేద ప్రజల బాగు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతూ ప్రజా మన్నన పొందిన నాయకుడు సీఎం కేసీఆర్ అని బిఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో భారతదేశంలో ఒక విప్లవాత్మక మార్పులు తేవడం కాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు దుర్గాప్రసాద్, మెప్మా అధికారి సరిత, వైద్య సిబ్బంది బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *