ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 9, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సఖీ కేంద్రం వారి సోజన్యం తో స్థానిక సాయి శ్రీ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సు కి ముఖ్య అధితులుగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మరియు సిరిసిల్ల సఖీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి రోజా గారు విచ్చేసి మాట్లాడుతు విద్యార్ధునులకి సమస్య లు, వాటికి సంబంధంచిన చట్టాల గురించి తెలియజేశారు. సఖీ కేంద్రం వారు 24 గంటలు అందుబాటులో వుంటారు అని ఆపదలో ఉన్న ఆడ పిల్లలని, మహిళల ను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళ శిశు సంక్షేమ శాఖ అధ్వర్యలో ఎప్పుడు ఒక్క రెస్కు వ్యాన్ అందుబాటులో ఉంటుంది అని పేర్కొన్నారు, మీకు జరిగే చిన్న చిన్న పరిణామాలు మీరు ఇచ్చే చిన్న చిన్న అవకాశాలు ఎక్కడికో దారి తీస్తాయి అని అన్నారు. విద్యార్థినులు వాటి నుండి చాలా జాగ్రత్త గా వున్నడాలని హెచ్చరించారు. ఆపదలో వున్నప్పడు 24 గంటలు అందుబాటులో వుండే 181 టోల్ ఫ్రీ నెంబర్ ను ఉపయోగించుకావాలని విద్యార్థిని లకు తెలియజేశారు. ఈ లాంటి కార్యక్రమాలు చేపిస్తుందుకు బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ను అభినందించారు. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థినులు మీకు వచ్చే సమస్యల పట్లా ముందే ఆలోచనలు చేసి జాగ్రత గా వుండాలి అని ఏదైనా సమస్య వుంటే వెంటనే అమ్మ నాన్న లకు తెలియజేయాలని అన్నారు. సమస్య లు మీరు చెప్పకపోవడం వల్ల పెద్దవి అవుతాయి అని తెలియజేశారు. ఏప్పటికైనా తెలిసి తెలియని తప్పు చేస్తే జీవితం కోల్పోతుంది అని విద్యార్థునులకి తెలియజేశారు.ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సఖీ కేంద్రం కెన్సిలర్ కళావతి, కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతి, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ , పట్టణ అధ్యక్షులు రుద్రవేనీ సుజిత్ కుమార్, నాయకులు, పోతర్లా వంశీ, పోతర్లా గణేష్ మరియు సఖీ కేంద్రం సిబ్బంది, కళాశాల ఉపాధ్యాయునిలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
