సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ అమెరికా వెళ్తున్న సందర్భంగా మంగళవారం కైలాస ప్రభాకర్ కు శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికిన నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ కైలాస ప్రభాకర్ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ వివిధ సందర్భాల్లో అన్నదానం చేస్తూ ఆర్యవైశ్యులు నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ,గజ్వేల్ లో నిర్మిస్తున్న వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం నిర్మాణ కమిటీలో క్రియాశీల పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న కైలాస ప్రభాకర్ అమెరికా వెళ్తున్న సందర్భంగా చిరు సన్మానం చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ,ఆర్యవైశ్య సీనియర్ నాయకులు కొమరవెళ్లి సుధాకర్, రావికంటి చంద్ర శేఖర్ , దొంతుల సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు




